Movie Review


ప్రముఖ ద‌ర్శకుడు సుకుమార్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా `1`. నేనొక్కడినే. ఈ సినిమాను జ‌న‌వ‌రి 10న విడుద‌ల చేయ‌బోతున్నట్టు స్వత‌హాగా మ‌హేష్ ప్రక‌టించాడు. ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతాన్ని స‌మ‌కూర్చారు. మ‌హేష్ ఇన్నేళ్ల కెరీర్‌లో దేవి సంగీతం స‌మ‌కూర్చడం ఇదే ప్రథ‌మం. దేవిశ్రీ ప్రసాద్‌, సుకుమార్‌కు మ‌ధ్య మంచి అండ‌ర్‌స్టాండింగ్ క‌నిపిస్తుంటుంది. వీరిద్దరి కాంబినేష‌న్‌లో గ‌తంలో వ‌చ్చిన‌వ‌న్నీ హిట్ పాట‌లే. తాజాగా ఈ మేజిక్ మ‌హేష్ సినిమాకు కూడా ప‌నిచేస్తోంద‌ని వినికిడి. తొలిసారి ప్రిన్స్ సినిమాకు ప‌నిచేస్తుండ‌టంతో దేవిశ్రీ కూడా మంచి ట్యూన్‌ల‌ ను ఇస్తున్నార‌ట‌. ఈ వార్త అటూ ఇటూగా ఆడియో కంపెనీల‌కు పాకింది.

 దీంతో మ‌హేష్ `1`నేనొక్కడినే సినిమా ఆడియో రైట్స్ బేరం మొద‌లైంది. నిర్మాత మాత్రం ఆది నుంచీ దాదాపు రూ.కోటి మీదే కూర్చుని ఉన్నారు. అంత‌కు త‌గ్గితే హ‌క్కుల్ని ఇచ్చేది లేద‌ని అంటున్నారు. కానీ ఆడియో కంపెనీలు త‌మ బేరాన్ని రూ.50ల‌క్షల నుంచి మొద‌లుపెట్టాయి. ఇప్పుడు రూ.75ల‌క్షల వ‌ర‌కు ఇవ్వడానికి సిద్ధమ‌వుతున్నాయి. కానీ నిర్మాత‌లు దిగిరావ‌డం లేదు. పోటీప‌డుతున్న కంపెనీల్లో ఆదిత్య, మ‌ధుర‌, ల‌హ‌రి, శ్రేయాస్‌, జంగ్లీ, టీ-సీరీస్‌, సిల్లీ మౌస్ త‌దిత‌ర కంపెనీలున్నాయి.

 కానీ సోనీ మాత్రం ఈ పోటీలో లేదు. గ‌తంలో అటు ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన‌ పులి, మ‌హేష్ ఖ‌లేజాను క‌లిపి రూ.1.80కోట్లకు సోనీ. తీసుకుంద‌ని ఘ‌నంగా ప్రచారం జ‌రిగింది. అందులో పాతిక శాతాన్ని కూడా వెన‌క్కి తిరిగి రాబ‌ట్టుకోలేక‌పోయింద‌నే వార్తలు కూడా వినిపించాయి. ఆ అనుభ‌వం దృష్ట్యా ప్రస్తుతం సోనీ ఈ బేరానికి దూరంగా మ‌స‌లుతోంద‌ని వార్తలు పొక్కుతున్నాయి.

 ఏదేమైనా గ‌ట్టి పోటీమీద సాగుతున్న ఆడియో బేరం ఎక్కడ ఎండ్ అవుతుందో చూడాలి. ఒక‌వేళ‌ రూ.కోటి ద‌గ్గర ఆగితే మాత్రం ఈ మ‌ధ్య కాలంలో రికార్డ్ ప్రయిజ్ అయిన‌ట్టే లెక్క‌. ఇంత‌కు మునుపు హ్యారిస్ జైరాజ్ సంగీత ద‌ర్శక‌త్వంలో విడుద‌లైన రామ్‌చ‌ర‌ణ్ సినిమా ఆరంజ్ మాత్రం రూ.1.10కోట్లకు ఆదిత్య ద‌క్కించుకుంద‌ని వినికిడి. ఇప్పుడు మ‌హేష్ సినిమా ఆరెంజ్‌ను బీట్ చేస్తుందో? లేదో చూడాలి

0 comments:

Post a Comment

 
Top