100 కోట్లు .. తెలుగు సినిమా రీచ్ కావడం పెద్ద జోక్ . 4 సంవత్సరాల క్రితం అరుంధతి సినిమా విడుదల సందర్భంలో కొంత మంది ఫిల్మ్ మేకర్స్ వ్యక్త పరిచిన అభిప్రాయాలు. అయితే నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి..హీరో నాగార్జున తెలుగు సినిమా 100 కోట్లు కలెక్షన్స్ ఎచివ్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే అభిప్రాయాన్ని మొదటి నుంచి వ్యక్త పరుస్తునే వున్నారు. చివరకు నాగార్జున.. శ్యామ్ ప్రసాద్ రెడ్డిల మాట నిజం కాబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ ల అత్తారింటికి దారేది చిత్రం 100 కోట్లకు చేరవవుతోంది.
ఇప్పటికే మగధీర రికార్డ్ ను బద్దలు కొట్టిన ఈ చిత్రం .. వంద కోట్లకు అతి సమీపంలో వుందంటున్నారు నిర్మాత బి.వి.ఎన్. ప్రసాద్ అయితే పవర్ స్టార్ తరువాత ఈ రికార్డ్ ..మిగిలిన తెలుగు హీరోలందరీరికీ సాధ్యం అవుతుందా..అంటే సాధ్యమే అనే ఒక మాట వినిపిస్తుంది. ఎందుకంటే .,పెద్ద సినిమాలన్ని సాధ్యమైనన్ని ఎక్కువ ధియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. మొదటి మూడు రోజుల్లోనే యాభై శాతం కలెక్షన్స్ రాబట్టుకుంటున్నారు. ఇది వినడానకి బావుంది. కానీ.. మరి అందరి హీరోల సినిమాలకు 100 కోట్లు వస్తాయనే సిద్దాంతం బాలేదు అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇప్పటి తెలుగు హీరోల్లో .. కుటుంబాలు పరుగులు పెట్టి ..పవన్ కళ్యాణ్.. ప్రిన్స్ మహేష్ బాబు సినిమాల్ని మాత్రమే చూస్తారు. అయితే మహేష్ బాబు కంటే..పవర్ స్టార్ విషయంలోనే కుటుంబాలు ఎక్కువుగా ధియేటర్స్ కు కదులుతాయి.
మరి మిగిలిన హీరోల చిత్రాలు..భారీ బడ్జెటో్ తో చేసి… ఎక్కువ ధియేటర్స్ లో విడుదల చేసినా.. యంగ్ ఆడియెన్స్ తప్ప …కుటుంబాలు ధియేటర్ కు కడలడం కష్టం. ప్రపంచ వ్యాప్తంగా 2 వేల ధియేటర్స్ లో రిలీజ్ చేసినాగానీ.. 100 కోట్లు కలెక్ట్ చేసే సత్తా… అందరికీ లేదు. పవర్ స్టార్ తరువాత .. బాక్సాపీస్ ను కొల్లకొట్టగల సత్తా వున్న. హీరోలు… ఎన్టీఆర్, మహేష్ బాబు.. రామ్ చరణ్ లే కనిపిస్తున్నారు.. మిర్చి నుంచి ప్రభాస్ కూడా మార్కెట్ పరంగా షేక్ చేస్తున్నాడు. ఏది ఏమైనా … మన టాలీవుడ్ హీరోలు 100కోట్ల మైలురాయిని వీజీగానే చేరుకునే రోజులు దగ్గర్లోనే వున్నాయని చెప్పొచ్చు.
0 comments:
Post a Comment